సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 1న ఆయన రాజధానికి వెళ్లనున్నారు. పలు జాతీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలపై నేతలతో చర్చించనున్నారు. కోల్కతా తరహా సభల నిర్వహణపై సమీక్ష జరపనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా సభలు నిర్వహించేందుకు టీడీపీ, జేడీఎస్, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు ముందుకొచ్చాయి. 10 రాష్ట్రాల్లో కోల్కతా తరహా సభలు పెట్టాలని పార్టీలు యోచిస్తున్నారు. ఈవీఎంల పనీతీరుపై వివిధ పార్టీల నేతలతో మంతనాలు జరుపనున్నారు. ఈవీఎంలు వద్దంటూ ఫిబ్రవరి 1న ఈసీని నాన్- ఎన్డీఏ నేతలు కలవనున్నారు. ఈవీఎంల అంశంపై రాష్ట్రపతిని కలిసే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.













