Chandrababu:డబుల్ ఇంజిన్ సర్కారుతో ..డబుల్ బెనిఫిట్ : చంద్రబాబు

డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చిందని, కేంద్ర సహకారంతో ఏపీకి అత్యధిక పెట్టుబడులు సాధించామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కర్నూలు (Kurnool) లో నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇటు సూపర్ సిక్స్ పథకాలు, అటూ సూపర్ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్ సేవింగ్ మేలు కలిగిందన్నారు. సూపర్ జీఎస్టీతో ఒనగూరుతున్న సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని లాభాలను చూడబోతున్నామని సృష్టీకరించారు. బిహార్ (Bihar) ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని, ప్రధాని మోదీ (Modi) విజయయాత్ర కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ మోదీ గెలవాలి. అదే భారత్ విజయం అదే మన విజయం అని అన్నారు.