Chandrababu:ఆధార్ తరహాలో ప్రతి కుటుంబానికి ..ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు

ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ (Aadhaar) తరహాలో ఫ్యామిలీ కార్డు (Family Card) ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపర్చాలని, ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్ (Update) చేయాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలి. ప్రభుత్వం సంక్షేమం, అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలి. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు. అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైన్ అంశం పరిశీలిద్దాం. త్వరలోనే పాపులేషన్ పాలసీ (Population Policy) తీసుకురావాలి అని అన్నారు.