రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం
రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పంటలు ఎండిపోకుండా రేయిన్గన్ టెక్నాలజీ తీసుకొచ్చామని, రాయితీపై 12 వేల ట్రాక్టర్లు ఇచ్చామని, మరో 12 వేలు ఇస్తామన్నారు. ఆర్థిక బలహీన వర్గాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చంద్రన్నబాట కింద 25 వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేశామని, ఎన్టీఆర్ క్యాంటిన్ల ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అన్నారు. కిడ్నీ బాధితుల పెన్షన్లను పెంచామని, డయాలసిస్ కేంద్రాలను పెంచామన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, కాపులకు 5 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్.. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మాటలతో మభ్యపేట్టే నాయకులు కాలగర్భంలో కలిసిపోతారు. చేతల్లో చూపెట్టే నేతలు చరిత్రలో నిలిచిపోతారు. మెనిఫెస్టోలో ఇవ్వని హామీలని కూడా అమలు చేశాం. 2029 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. సరైన విజన్‌తో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలి. 2029 నాటికి దేశంలో ఏపీ నెం.1గా రాష్ట్రంగా ఉంటుంది అని చంద్రబాబు సృష్టం చేశారు.













