పేదరికం లేని సమాజమే లక్ష్యం : చంద్రబాబు
రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయంలో రాజీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. భవిష్యత్ కు నీటి భరోసా కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మరల్చుకుని ముందుకు సాగాలన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి కొరతను నివారిస్తామన్నారు. పోలవరం, అమరావతి తనకు రెండు కళ్లని చెప్పారు. ప్రపంచ మేటి నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.













