Chandrababu: భవిష్యత్లో అదే కీలకం : సీఎం చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ (MSME)లు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సేవారంగం నుంచి మనకు 6.3 శాతం ఆదాయమే వస్తోందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
టెక్నాలజీ అనేది గేమ్ ఛేంజర్. భవిష్యత్లో అదే కీలకం. భవిష్యత్లో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయి. ఈ నెలల్లోనే తల్లికి వందనం అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు (Free bus) అమలు చేస్తాం. దీపం-2 కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. పీ-4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరగాలి. తలసరి ఆదాయంలో విశాఖ (Visakhapatnam ) ముందుంటే, శ్రీకాకుళం (Srikakulam) వెనకబడిరది. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల డయాఫ్రం వాల్ ఖర్చు రెండున్నర రెట్లు పెరిగిందన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. విశాఖను ముంబయిలా తీరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ నగరానికి అనేక పరిశ్రమలు, ఐటీ సంస్థలు వస్తున్నాయి. పోలవరం` బనకచర్ల అనుసంధానం చేస్తాం. తిరుపతిని కూడా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తాం. ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా కూటమి నేతలు ప్రయత్నించాలి. క్షేత్ర స్థాయిలో చూస్తేనే ప్రాజెక్టు పరిస్థితి ఏంటో తెలుస్తుంది అని అన్నారు.













