చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అభినందించిన సీఎం
రాజ్యసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని,విప్ లను సీఎం జగన్ అభినందించారు. రాజ్యసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 151 సంఖ్యా బలం, జనసేన పార్టీ మద్దతు 1 ఉంది. కరోనా నేపథ్యంలో పటిష్ట ప్రణాళికలతో వైఎస్ ఆర్ సిపి ఎంఎల్ఏ లును సమన్వయం చేసి పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు ఇన్ వ్యాలీడ్ కాకుండా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓట్లు వేసేలా చేయడం, వైఎస్ఆర్ సి పి నలుగురు అభ్యర్థులకు కరెక్ట్ గా ఓట్లు రావడం, వారి ఘన విజయానికి క•షి చేసిన ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, విప్ లను సీఎం జగన్ అభినందించారు.













