బీసీలకు చంద్రన్న పెళ్లి కానుక
వెనుకబడిన తరగతులకు చెందిన నూతన వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్థిక సహాయం అందించే కొత్త పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఈ పథకం అములు కానుంది. నూతన సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ఆరంభిస్తారు. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, దారిద్య్ర రేఖకు దిగువన వున్న బీసీ కులాలవారు అర్హులు. అబ్బాయికి 21, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి తీరాలని నిబంధన. ఈ పథకం కింద పెళ్లి సమయంలో ఒక్కో జంటకు రూ.30 వేలు చంద్రన్న పెళ్లికానుక కింద అందిస్తారు. 2017-18 సంవత్సరంలో 40 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఇందుకు రూ.120 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. చంద్రన్న పెళ్లి కానుక పథకానికి మరో రెండేళ్ల తరువాత పదో తరగతి అర్హత విధించాలని ముఖ్యమంత్రి సూచన.













