ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక తనిఖీలలో 47.5 కోట్ల నిధులు స్వాధీనం: ఏపీ సీఈవో
ఆంధ్రాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలను ప్రలోభ పెట్టడానికి అక్రమంగా మద్యం, నగదు రవాణా కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు సుమారు 47.5 కోట్ల నిధులు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీలలో సుమారు 17.5 కోట్ల నగదు పట్టుబడగా.. తనిఖీలలో 5.13 లక్షల లీటర్ల మద్యం, మాదకద్రవ్యాలు దొరికాయి. వీటితో పాటుగా తనికీల్లో పంచి పెట్టడం కోసం సిద్ధం చేసుకున్న గిఫ్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు తనిఖీలలో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి 4,337 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తనిఖీలు నిర్వహించినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద 247 కేసులు నమోదైనట్లు మీనా పేర్కొన్నారు. ఇవి దొరికితే మనకు తెలిసినవి.. దీన్ని బట్టి దొరక్కుండా ఇంకెంత రాజకీయ మాఫియా జరుగుతోందో ఆలోచించండి..?













