ఆఖరి నిమిషం వరకు… ఆ విషయం చెప్పం
ఎన్నికల ఓట్ల లెక్కిపు కోసం 21 వేల మంది వరకూ సిబ్బంది అవసరం అవుతారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సృష్టం చేశారు. అమరావతిలో ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఆఖరి నిమిషం వరకూ ఎవరూ.. ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారనే విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. సిబ్బంది ఎంపిక తర్వాత రెండు సార్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపడతామని అన్నారు.
మే 23వ తేదీ ఉదయం ముందుగా పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కిస్తామన్నారు. కౌంటింగ్ ప్రారంభమయ్యే ముందు చివరి నిమిషం వరకూ పోస్టల్, సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల కౌంటింగ్‌కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వివిధ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావాల్సి ఉందని తెలిపారు.













