డిసెంబర్లో ఏపీ కేబినెట్ విస్తరణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని మరో మారు విస్తరించన్నుట్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్ మొదటి, రెండవ వారంలో ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఈ విస్తరణలో ఐదు లేదా ఆరుగురు కొత్తవారికి చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరు, ముగ్గురికి ఉద్వాసన కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఆరునెలల క్రితం విస్తరించిన మంత్రివర్గంలో కొందరు నాయకులు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వారి స్థానంలో కొత్త వారిని చేర్చుకోవచ్చంటున్నారు. కొందరు మంత్రుల శాఖలను సైతం మార్చి తన ఆలోచనలకు అనుగుణంగా పని చేయగల వారికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. కాగా త్వరలో వైకాపా నుంచి టీడీపీలో చేరనున్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. దీనికి తోడు గతంలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలో సైతం ఒకరిద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సృష్టమవుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో చంద్రబాబు బృందంలో చేరేందకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.













