AP Cabinet :17న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (AP Cabinet )సమావేశం ఈ నెల 17న సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయం(Secretariat)లోని మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో పాలనాపరంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అలాగే చంద్రబాబు దావోస్ టూర్ (Davos Tour )పై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తరువాత మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లనుంది.













