ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నిర్ణయాలు -3
సీఆర్డీఏ భూములు :
• సీఆర్డీఏ పరిధిలో నాబార్డుకు గతంలో ఇచ్చిన భూమిని 4.3 ఎకరాల భూమిని గతంలో రూ.4కోట్లకు కేటాయించగా, దాన్ని రూ.2 కోట్లు చేయడానికి మంత్రిమండలి ఆమోదం.
• రామకృష్ణ మిషన్‌కు గతంలో ఎకరం రూ.10 లక్షల చొప్పున 60 ఏళ్ల లీజ్ ప్రాతిపదికన ఇచ్చిన 5 ఎకరాల భూమి విషయంలో లీజు నిబంధన తొలగిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
• తుళ్లూరులో కేంద్రీయ విద్యాలయం- 1, నేలపాడులో కేంద్రీయ విద్యాలయం-2 లకు గతంలో ఇచ్చిన చెరో 5 ఎకరాలను చదరపు మీటరుకు రూపాయి చొప్పున లీజుకు ఇవ్వగా, ఇప్పుడు మొత్తం భూమిని రూపాయికి ఇవ్వాలని నిర్ణయం.
• అలాగే, తుళ్లూరులో ఏర్పాటుచేసే కేంద్రీయ విద్యాలయానికి అదనంగా మరో 3 ఎకరాలను కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.
• ఇండియా ఫండ్ అడ్వయిజర్ సంస్థకు గతంలో 2.30 ఎకరాలను 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఇవ్వగా, ఇప్పుడు లీజు ప్రాతిపదికన కాకుండా ఎకరం రూ.4 కోట్లు చొప్పున ధర నిర్ణయిస్తూ మంత్రిమండలి ఆమోదం.
• సెంట్రల్ చిన్మయ్ మిషన్ ట్రస్టుకు గతంలో ఎకరా రూ.50 లక్షల చొప్పున 3 ఎకరాలు ఇవ్వగా, ఇప్పుడు ఎకరం రూ.లక్షన్నర చొప్పున లీజు చెల్లించేలా 35 సంవత్సరాలకు కేటాయింపు. ఏటా 5 శాతం లీజు మొత్తం పెంపు.
రాజధాని పరిధిలో సంస్థలకు భూములు :
• రాజధాని పరిధిలో 118.85 ఎకరాల భూమిని 17 సంస్థలు, విద్యాసంస్థలకు భూ కేటాయింపులపై చర్చించారు. అత్యున్నత విద్యాసంస్థలు పదింటిని గుర్తించి వాటికి ముందస్తుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో భూముల కేటాయింపు ఉండాలని స్పష్టంచేశారు.
• భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు 7.5 ఎకరాలు, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 57 సెంట్లు, ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటీవ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సంస్థకు ఎకరం, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్విసెస్ డిపార్టుమెంటుకు 4.23 ఎకరాలు, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ డిపార్టుమెంటుకు 4 ఎకరాలు, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు 3 ఎకరాలు, ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌కు 3 ఎకరాలు కేటాయించారు.
ఇతర అంశాలు :
• రాజధాని ప్రాంతంలో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచన. ఎకనామిక్ సిటికి దగ్గరలో ఏర్పాటు చేయాలి. అక్కడ అన్ని బ్యాంకులకు భూములు ఇవ్వాలి.
• ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి నిమిత్తం విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్టుమెంట్ రీజియన్ స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ వారికి లే అవుట్ అప్రూవల్, డెవలప్మెంట్ ఛార్జీల మినహాయింపునకు మంత్రిమండలి నిర్ణయం.
• విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరంలోని 15.37 ఎకరాలలో ఏర్పాటు చేయదలచిన స్కూలు కోసం చెల్లించిన రూ.1.15,26,415 మేర ఉన్న ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలను మాఫీ చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
• విజయవాడలోని గాంధీ మునిసిపల్ హైస్కూల్ మొదటి అంతస్తును బీఆర్జీ కేఎస్వీ ఎడ్యుకేషనల్ సొసైటీకి మహిళా కళాశాల నిర్వహణ కోసం లీజుకు ఇవ్వడానికి ఆమోదం.
• దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ బిల్-2018 (సవరణ)కు ఆమోదం.
కుప్పంలో ఫస్టు క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు :
• చిత్తూరు జిల్లా కుప్పంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాసు కోర్టు) మంజూరుకు మంత్రిమండలి ఆమోదం. సిబ్బంది నియామకానికి, నిధుల కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్. మొత్తం 20 పోస్టుల మంజూరు.













