మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో మరో కొత్త పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరిట ఈ పథకాన్ని తీసుకురానున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ.50 వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎస్ ముసాయిదా, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపాం ఇంజినీరింగ్ కళాశాలలో గిరిజనులకు 50 శాతం సీట్లిచ్చే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.













