పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు, ఆంధప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణ, ఆంధప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించింది. 6 జిల్లాల్లో వాటర్షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు :
ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆర్జీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఆమోదం. ఏ సీజన్లో పరిహారం ఆ సీజన్లోనే చెల్లించాలని నిర్ణయం. నివార్ తుపాను బాధితులకు ఈనెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం. చంద్రబాబు బకాయి పెట్టిన 1200 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాం. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం. ఏపీలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 27 మెడికల్ కాలేజీలకు రూ.16 వేల కోట్ల నిధులు. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం. ప్రతీ భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు. ఆంధప్రదేశ్ పర్యాటక పాలసీని ఆమోదించిన కేబినెట్. 6 జిల్లాల్లో వాటర్షెడ్ల అభివృద్ధి పథకం అములకు కేబినెట్ ఆమోదం. కొత్త పర్యటన విధానానికి ఆమోదం. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్స్ ప్యాకేజీ ఆమోదం. రూ.198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఆర్థిక సాయం. హోటల్ రంగం రీస్టార్ట్ కోసం రూ.15 లక్షల వరకు రుణం. మొదటి ఏడాదికి 4.5 శాతం రాయితీతో వడ్డీ రుణాలు. సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాన్ని మీడియాకు వెల్లడించారు.













