ముగిసిన క్యాబినెట్ భేటీ
జిఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా హైపర్ కమిటీ సిఫార్సులను నిర్ణయానికి కాబినెట్ ఆమోదం. విశాఖకు పరిపాలన రాజధాని తరలింపుకు ఆమోదం. సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ ఏర్పాటు. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం. ఇన్సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త తో విచారణ జరపాలని నిర్ణయం. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయం.
4 బిల్లులకు క్యాబినెట్ ఆమోదం..
రాజధాని రైతులకు భారీగా పరిహారం పెంపు.. 10 ఏళ్ళు ఇచ్చే పరిహారం 15 ఏళ్లకు పెoపు. రాజధాని రైతు కూలీలకు ఇచ్చే ఫెంచం 2500 నుంచి 5000కు పెంపు.. కలెక్టర్ ల వ్యవస్థ లో మార్పు చేయాలని క్యాబినెట్ లో చర్చ.. జిల్లాల సంఖ్యను పెంచే విషయంలో క్యాబినెట్ లో చర్చ.. 4జిల్లాలకు కలిపి ఒక కమిషనరేట్ ను ఏర్పాటు చేసే విషయం పై చర్చించిన క్యాబినెట్.. CRDA ను రద్దు చేస్తూ…అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ గా మార్పు…క్యాబినెట్ ఆమోదం













