చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేబినెట్ ఆమోదం
చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేబినెట్ ఆమోదం – రాష్ట్రంలో 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లకు రూ. 756 కోట్లు కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ – ఒక్కో ఇంటికి రూ. 60 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం – ఐటీ పాలసీ కింద ఇచ్చే రాయితీల ప్రోత్సాహానికి కేబినెట్ ఆమోదం – రాజధానిలో ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై చర్చ – క్యాపిటల్ హౌసింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాలని సీఆర్డీఏకు సీఎం ఆదేశం – సీఆర్డీఏ చట్టంలో ఈ మేరకు నిబంధనలు పొందుపర్చాలని చంద్రబాబు సూచన – రాజధానిలో జర్నలిస్టు సోసైటీకి 25 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం – సీఆర్డీఏ చట్టంలో నిబంధనలు పొందుపర్చాక తుది ఆమోదం ఇవ్వాలన్న సీఎం – ఆటోలు, ట్రాక్టర్ లకు లైప్ టాక్స్ రద్దును కేబినెట్ ఆమోదం – ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు ఏపీ కేబినెట్ ఆమోదం.













