AP Cabinet : ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
రాష్ట్రంలో నూతన బార్ పాలసీ (New bar policy )కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో (RTC bus) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు పార్థసారథి వెల్లడిరచారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, అరకు, భవానీ ఐలాండ్స్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్ (AP BDCL) రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వైష్టవి ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాల టీటీడీ (TTD) భూమిని ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చినట్లు వెల్లడిరచారు. బీసీ వర్గాల సంక్షేమం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు. 40 వేల హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.







