10 శ్వేత పత్రాలు విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయం
శ్వేతపత్రాలు :
• 1.రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు తీరు, 2.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి-వృద్ధిరేటు, 3. రైతుల సంక్షేమం, 4.సహజ వనరుల నిర్వహణ, 5.గ్రామాలు-పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, 6.విద్యుత్-ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్….సుపరిపాలన సహా మొత్తం 10 శ్వేత పత్రాలు విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయం.
• 02.01.2019: వయాడక్ట్ పాంప్లెట్ విడుదల- రాష్ట్ర పునర్విభజన అంశాలు, అమలుపై చర్చ.
• 03.01.2019: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, వృద్ధిరేటు.
• 4.1.2019: సాంఘిక సాధికారత. సంక్షేమం. (డైరెక్ట్ ట్రాన్స్ఫర్) 100% రేషన్. ఎన్టీఆర్ భరోసా. చంద్రన్న బీమా. హౌసింగ్. స్కాలర్షిప్లు. ఆదరణ-2, సేవలు: అన్నా కేంటిన్లు, పేదరికంపై గెలుపు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్.
• 5.1.2018: రైతుల సంక్షేమం. ఆహార భద్రత. జడ్‌బిఎన్‌ఎఫ్. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఉబరైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్.
• 6.1.2018: గ్రామాలు,పట్టణాలలో బేసిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్. 10స్టార్, 9స్టార్ రేటింగ్. తాగునీరు, పారిశుద్యం, ఓడిఎఫ్ ప్లస్, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, ఎల్ ఈడి బల్బులు, రోడ్ కనెక్టివిటి.
• 7.1.2018: విద్యుత్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రాజధాని నిర్మాణ పురోగతి. రోడ్ల అభివృద్ది.
• 8.1.2018:మానవ వనరుల అభివృద్ధి. నాలెడ్జ్ స్టేట్‌గా ఏపీ విద్య, వైద్యం పోషకాహారం.
• 9.1.2019: పరిశ్రమలు, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి. ఎంఎస్ఎంఈలు. యువనేస్తం. నూతన ఆవిష్కరణలు. సేవారంగం: ఐటీ, ఐటీఈఎస్. ఫిన్‌టెక్. టూరిజం.
• 10.1.2019: గవర్నెన్స్. ఆర్ టిజి. ఈ ప్రగతి, ఈ గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్
• రాష్ట్రం ఏర్పడిన నాటి స్థితిగతులు, కొత్త ప్రభుత్వం ముందు సవాళ్లు, రైతుల ఆదాయం రెట్టింపు, రూ.83 వేల కోట్లతో 30 లక్షల ఇళ్ల నిర్మాణం, 16 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం, ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం, పోలవరానికి సీబీఐపీ అవార్డు, వివిధ శాఖలకు 604 అవార్డులు, 8నెలల్లో టీసీఎల్ ప్రాజెక్టు పూర్తి చేస్తుండటం, 6వేల ఉద్యోగాలు రానున్నాయి, ప్రపంచంలోనే నెంబర్‌వన్ మెడ్‌టెక్ ప్రాజెక్టు.. తదితర అంశాలన్నింటినీ శ్వేతపత్రాలలో పొందుపరచాలి.
ఆదరణ-2లో సబ్సిడీ పెంపు:
• ఆదరణ-2 కార్యక్రమం కింద పొందుతున్న సబ్సిడీని 70% నుంచి 90%కు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం.
• 20% అదనపు సబ్సిడీ పెంపు వల్ల అదనంగా ప్రభుత్వానికి రూ.195 కోట్ల భారం పడనుంది.
• లబ్దిదారుడు ఇకపై యూనిట్ వ్యయంలో కేవలం 10% శాతం చెల్లిస్తే సరిపోతుంది. 8 లక్షల కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఒక్కోదఫా రూ.2 లక్షల యూనిట్ల చొప్పున 8 లక్షల యూనిట్లను నాలుగు విడతలుగా పంపిణీ చేస్తున్నాం. ఇది బీసీల ప్రభుత్వమని మరో మారు రుజువు చేసుకున్నాం.
ఆదరణ-2 అర్హతల్లో సవరణ:
• ‘ఆదరణ-2’ కార్యక్రమం లబ్దిదారుల అర్హతా ప్రమాణాల్లో మార్పుల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• ఆదరణ పథకం కింద ఎంపికైన లబ్దిదారులు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ లబ్ది పొందేందుకు అర్హత లభిస్తుంది.
పోలీసులకు పదోన్నతి :
• 2,585 పోలీస్ కానిస్టేబుళ్లను (సివిల్) హెడ్ కానిస్టేబుళ్లుగా, 566 హెడ్ కానిస్టేబుళ్లని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (సివిల్)గా పదోన్నతి కల్పిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
టీచర్లకు పదోన్నతులు :
• రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న 610 గ్రేడ్ టూ లాంగ్వేజ్ పండిట్లు (తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం), 262 పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి.
• అలాగే, నంద్యాల, గుడివాడ మునిసిపల్ హైస్కూళ్లలో పనిచేస్తున్న గ్రేడ్ టు లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు 22 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి.
భీమవరంలో ఫిషరీస్ అండ్ ఓషియన్ యూనివర్శిటీ:
• పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి నిర్ణయం.
• ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటుచేస్తారు. ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ తెలిపిన ఉద్దిరాజు ఆనందరాజు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్.
• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేక్ హోల్డర్‌గా ఉంటుంది.
• మత్స్యరంగంలో నైపుణ్యాభివృద్ధి సాధించడం కోసం ఈ యూనివర్శిటీని ఏర్పాటుచేస్తున్నారు.
• రాష్ట్రంలో 2 లక్షల హెక్టార్లలో సాగు అవుతున్న ఆక్వాకల్చర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రంగంలో నైపుణ్యాన్ని సాధించేందుకు వీలుగా ఈ వర్శిటీని ఏర్పాటుచేస్తారు.
• 1600 మంది విద్యార్ధులు చదువుకునేందుకు అవకాశం.
APMIDCL
• ‘ఆంధ్రప్రదేశ్ మ్యారీటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ ఏర్పాటుకు మంత్రిమండలి నిర్ణయం.
• కంపెనీ చట్టం-2013 ప్రకారం దీన్ని ఏర్పాటుచేస్తారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో పాటు, ఇతర సముద్ర సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి ఈ సంస్థ దోహదపడుతుంది.













