10 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జులై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. జులై 12న కొత్త ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి బడ్జెట్ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏఏ శాఖకు ఎంతెంత నిధుల కేటాయిస్తారన్న దానిపై, ఏ రంగానికి పెద్ద పీట వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.













