22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు ఉబయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. శ్వేతపత్రాలపైనా అసెంబ్లీలో చర్చించనున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్, శ్వేతపత్రాలపై చర్చ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.













