మీ నవరత్నాల్లో ఒక రత్నం ఎగిరిపోతుంది
వైకాపా ప్రభుత్వం కొత్త నిబంధనను పెట్టి నవరత్నాల్లో ఒక రత్నానికి తూట్లు పొడిచారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా సమయంలో పాఠశాలలు, కాలేజీలు తెరకవపోయినా స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే అమ్మఒడిని ఇచ్చారన్నారు. ఈ సంవత్సరం పాఠశాలలు తెరిచినా 75 శాతం హాజరు ఉండాలంటూ కొత్త నిబంధలు పెట్టారని మండిపడ్డారు. మీ నవరత్నాల్లో ఒక రత్నం ఎరిగిపోతుందని ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. కాలేజీలకు బకాయిపడ్డ రూ.1000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లు లేక ఉద్యోగ ప్రయత్నాలు చేయలేని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి విద్యార్థుల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు.













