2024లో ఏపీలో అధికారం మాదే: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా ఎదుగుతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 2024 కల్లా రాష్ట్రంలో అధికారం చేపడతామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా ప్రగతి పధంలో నడిపించడమే భాజాపా లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఏపీలో భాజాపా మరింత పుంజుకుని అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన 2 పార్టీలూ అవినీతిలో కూరుకుపోయాయన్నారు.













