ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకే ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.8లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని, అందులో రూ.3లక్షల కోట్లను రహదారుల నిర్మాణానికి వెచ్చిస్తోందని తెలిపారు. పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పంతోనే కేంద్రం గత నాలుగేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. పోలవరం అంచనాలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు రూ.3 లక్షల కోట్లతో వేస్తున్నామన్నారు.













