PVN Madhav: ఆ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం : పీవీఎన్ మాధవ్
ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని (Prime Minister ) సలహాలు, సూచనలు ఇచ్చినట్లు వెల్లడిరచారు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తలను కలవాలని ప్రధాని చెప్పారు. ట్రంప్ (Trump) టారిఫ్‌ల వల్ల రాష్ట్రంలో ఆక్వా రైతులు పడే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ప్రధాని చెప్పారు. రాష్ట్రంలో రైతులు, ఇతర వర్గాల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పార్టీ అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ప్రధానికి వివరించాను. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించాం. వైసీపీకీ కేంద్రం మద్దతు ఉందన్న ప్రచారం అవాస్తవం. ఆ పార్టీ అవినీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా బీజేపీ(BJP) రాజీలేని పోరాటం చేస్తోంది అని మాధవ్ తెలిపారు.







