ఈలాంటి సీఎం మనకు అవసరమా? : పురందేశ్వరి
జనసేనతో తమ పొత్తు కొసాగుతుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. కాకినాడలో ఆమె పర్యటించారు. రామారావుపేటలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తు విషయం మా అధినాయకత్వం చూసుకుంటుంది. నాణ్యత లేని మద్యం, ఇసుక అక్రమాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుంది. టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలి. ప్రజల కోసం ఎవరు మాట్లాడినా జగన్ అణచివేతకు గురి చేస్తారు. పరదాల చాటున తిరిగే ఈ సీఎం మనకు అవసరమా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి అని కోరారు.













