2024లో అధికారం మాదే : కన్నా
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికార వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సృష్టం చేశారు. 2024లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటామని.. కేంద్రంలో మరోసారి మోదీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన ఆత్మీయ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని, ఇందులో భాగంగానే టీడీపీ నాయకుల చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమీప భవిష్యత్లో ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరతారని చెప్పారు.













