ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర సాయం అందిస్తోంది. రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇస్తున్నారు. ఈఏడింటితో పాటు వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా కలిపారు. మొత్తం రాష్ట్రంలోని 8 జిల్లాలకు సహకారం అందిస్తున్నారు. నాడు, నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని విధాలుగా సహకరిస్తుంది. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సహకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. రాజమహేంద్రరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.269 కోట్లు కేటాయించారు అని పురందేశ్వరి తెలిపారు.













