Amit Shah: అమిత్ షా ను ఆహ్వానించిన ఏపీ బీజేపీ నేతలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా అమరావతి (Amaravati)లో ఈ నెల 25న నిర్వహించనున్న అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభకు రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను ఏపీ బీజేపీ నేతలు కోరారు. బుధవారం, పార్లమెంటులోని అమిత్ షా కార్యాలయంలో ఆయనతో బీజేపీ స్టేట్ చీఫ్ పీవీఎన్ మాధవ్ (PVN Madhav), కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupatiraju Srinivasavarma), రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.






