ఇలాంటి ప్రచారాలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకాలి : సోము
కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్లు, రంగులు ఏంటి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మేరకు సోము వైఎస్ జగన్కు మరో లేఖ రాశారు. కేంద్ర పథకాలపై మీ స్టిక్కర్లు ఏంటి? అంటూ సీఎం జగన్ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఎలా అంటిస్తారని ప్రశ్నించారు. బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు.













