పవన్, చంద్రబాబుల భేటీని స్వాగతిస్తున్నా
విశాఖ ఘటన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భేటీలో తప్పు లేదని దాన్ని తాను స్వాగతిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించికొని తిరిగొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విపక్షాలపై చేయిస్తున్న భౌతిక దాడులు దేశంలో మన రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నాయన్నారు. రాజమహేంద్రవరంలో ఓ ఎంపీ కనుసన్నల్లో అమరావతి రైతుల మహా పాదయాత్రపై జరిగిన దాడిని కేంద్రంలోని పెద్దలకు వివరించినట్లు తెలిపారు. రాజకీయాల్లో పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గురించి తాను మాట్లాడనని అన్నారు. జనసేన, బీజేపీ కలిసే పనిచేస్తాయని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్ అడిగిన రోడ్‌మ్యాప్‌ను తమ పార్టీ పెద్ల వద్ద ఆయన మరోమారు ప్రస్తావించి చర్చిస్తారన్నారు.













