ఏపీలో బయో అంతర్జాతీయ సదస్సు
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డవలప్మెంట్ బోర్డు, గీతం విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ నెల 10, 11 తేదీల్లో గీతం విశ్వ విద్యాలయం వేదికగా ఏపీ బయో 2017 పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ పార్మసీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.గణపతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో అంతర్జాతీయ సదస్సులో స్టాన్ఫర్డ్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు దేశంలోని పలు ప్రముఖ పరిశోధనా కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సులో బయోటెక్నాలజీ రంగంతో పాటు వ్వవసాయ, సముద్ర సంబంధ ఉత్పత్తుల రంగంలో బయోటెక్నాలజీ పాత్ర, జీవ శాస్త్రాలు, ప్రజారోగ్యం, ఉత్పత్తుల రంగంలో బయోటెక్నాలజీ పాత్ర, జీవ శాస్త్రాలు, ప్రజారోగ్యం, ఔషధ రంగంకు సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు ప్రసంగిస్తారని తెలిపారు. జౌషధ రంగంపై ప్రత్యేక చర్చలు ఉంటాయన్నారు. సదస్సులో యువ శాస్త్రవేత్తలకు ప్రత్యేక చర్చాగోష్టి ఉంటుందని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొనదలచిన వారు ఇతరత్రా సమాచారం కోసం గీతం విశ్వవిద్యాలయం ఎపిబయో అంతర్జాతీయ సదస్సు కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. వివరాలకు సదస్సు వెబ్సైట్ http://apbio.gitam.edu/ ను పరిశీలించవచ్చునని సూచించారు.













