తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాం సంపదమయం
నాడు ఎన్టీఆర్ కాలంలో లక్షల్లో..నేడు చంద్రబాబు పాలనలో భూమి కోట్లు పలుకుతోంది
రాజధాని అమరావతి పరిధి రైతాంగం హర్షాతిరేకం
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు, పనికిరాని భూముల విలువ కోట్లకు చేరుకుంది.. లక్షాలాది ప్రజలకు సౌభాగ్యం కలిగింది… ఊహించని విధంగా ఉన్నతంగా మారిపోయింది… దినదినగండంగా రెక్కడితేగానీ డొక్కాడని రైతాంగం , బడుగుబలహీన వర్గాల జీవితాల్లో భూమి ధరలు బంగరు వెలుగులు సృష్టించాయి.. . హైదరాబాద్, సికింద్రాబాద్ లు నాలువందల ఏళ్లపాటు అభివృద్ధి చెంది చారిత్రిక ప్రాంతంగా గుర్తింపు పొందితే …నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మూలంగా గుట్టలు, దిబ్బలుగా ఉన్న భూములను ఐటీ పరిశ్రమకు కేంద్రస్థానంగా, పదేళ్ళలోనే సైబరాబాద్ గా తీర్చిదిద్ది ప్రపంచానికి పరిచయం చేశారు..గుర్తింపు తెచ్చారు. సైబరాబాద్ లోని భూమిదారులను కోటీశ్వరులను చేశారు…ఐటీ పరిశ్రమల స్థాపనతో వేలాది కంపెనీల్లో పది లక్షలకు పైగా ఉన్నతోద్యోగాలు, లక్షల్లో జీతాలు తీసుకునే వైట్ కాలర్ ఉద్యోగాలు లభించాయి… తెలుగు జాతి ప్రజలకు , ముఖ్యంగా యువతకు ప్రపంచస్థాయిలో అవగాహన పెంచారు…మేధావులుగా ప్రపంచస్థాయి సంస్థలు క్యూగట్టి ఉద్యోగాలు ఇచ్చేస్థితిని కల్పించారు…అది గతం …
ప్రస్తుతం వర్తమానం …విభజన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ గా మారింది.. తెలుగు ప్రజల అదృష్టం కొద్దీ విభజన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ కి అధికారం కట్టబెట్టారు…కొత్తగా రాజధానికి నిర్మించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భుజాన వేసుకున్నారు… విజయవాడ కు సమీపంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు సమ దూరంలో గుంటూరులో కృష్ణానది పక్కన అమరావతి పేరుతో నూతన రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు…నాలుగున్నరేళ్ళలో అమరావతి పరిసరాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి..
గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదిపై కనకదుర్గ వారధిని నిర్మించారు. దాంతో విజయవాడ ప్రజలకు తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలు చేరువయ్యాయి.. దాంతో ఇక్కడి భూముల ధరలు వేల నుంచి లక్షల్లోకి వెళ్ళాయి. కూరగాయలు, ఆకుకూరలు పండించే భూముల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది…భవంతులు వచ్చాయి…ఇప్పుడు అమరావతి రాజధానికి ఆనుకుని ఉన్న తాడేపల్లి, ఉండవల్లి,మంగళగిరి ప్రాంతాల భూములకు మరీ డిమాండ్ పెరిగింది..నాలుగేళ్ల వరకూ లక్షల్లో పలికిన భూములకు ఇప్పుడు కోట్లలో ధరలు వినపడుతున్నాయి…కొనడానికి స్థలం దొరకని స్థితి… మధ్యతరగతి రైతుల్లో ఆనందోత్సాహాలు.. కూరగాయలు పండించుకునే రైతులు రియల్ ఎస్టేట్ కు ఊతమిస్తున్నారు… కొంత భూమి అమ్ముకుని మరోచోట సాగును కొనసాగించేందుకు వ్యవసాయ భూమి కొంటున్నారు…తాతలనాటి నుంచి వ్యవసాయంపై ఆధారపడ్డ కొందరు రైతులు ఇక్కడే కొంత భూమిని సాగు చేసుకుంటున్నారు …ఇకపై ఆయా రైతుల కుమారులు, మనవళ్ళు ఉన్నత చదువులకు ప్రాధాన్యమిస్తున్నారు…ఇప్పటి వరకూ భూమిపై ఆధారపడి తృణమోపణమో సంపాదించుకుంటూ కాలక్షేపం చేస్తున్న ప్రస్తుత తరాల జీవితాల్లో కొత్త వెలుగులు, ఉన్నత చదువులు, సౌభాగ్యవంత నిర్వహణ గోచరం కానుంది..
తాదేపల్లిలో ఒక రైతుకు ఇప్పటి వరకూ ఏడెకరాల భూమి ఉంటె నాలుగు ఎకరాలు డెవలప్మెంట్ కు ఇచ్చాడు..ముక్కలుగా మూడు చోట్ల ఉన్న మూడు ఎకరాల్లో ఇంకా గతం నుంచీ వస్తున్న ఆకుకూరల సాగును కొనసాగిస్తున్నాడు.. తన తాత ముత్తాతలు కాయకష్టంతో గడిపారని… ఇక తన కుమారుడు, మనవడు తర్వాత తరం జీవితాలను బంగారుమయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనకు జిందాబాద్ పలుకుతున్నాడు.. “కులం కూడు బెడుతుండా? ఎంత ఆస్తిలిచ్చినా కుమారులైనంత మాత్రాన ఆడుకుంటారా ?…పెద్దకొడుకు మాదిరి గా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రకాల వర్గాలను ఆదుకుంటున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజల జీవితాలను ఉన్నతగా తీర్చిదిద్దుతున్నారు,ఇంతకంటే ప్రజలకు ఏం కావాలి’’ అంటూ “మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టాలి నా వోటు ఈసారి తెలుగుదేశం పార్టీకే’’ అంటూ రైతాంగం, వివిధ వర్గాల ప్రజలు ముక్తకంఠంతో పలకడం కొసమెరుపు.
–జాస్తి గోపాల ప్రసాద్.













