ఏపీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇండియా టుడే గ్రూప్ ఏపీకి ఉత్తమ టూరిజం అవార్డును ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2018 సదస్సులో ఈ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తోడ్పాటుతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని అఖిలప్రియ చెప్పారు. ఎఫ్1హెచ్2వో అంతర్జాతీయ స్థాయి పోటీలనూ అమరావతిలో వియవంతంగా నిర్వహించామని అన్నారు.













