రాష్ట్రప్రజలను సురక్షితంగా అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్న డ్రైవర్ ని : చంద్రబాబు
రాష్ట్రప్రజలను సురక్షితంగా అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్న డ్రైవర్ నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మోటార్ వాహనాల జీవితకాల పన్ను మినహాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆటో డ్రైవర్లు కృతజ్జ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసం వద్ద సీఎం చంద్రబాబును పెద్ద సంఖ్యలో ఆటోడ్రైవర్లు కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో నడిపి డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. ఏళ్ళతరబడి చేస్తున్న డిమాండుపై సానుకూలంగా వ్యవహరించి రోడ్డు టాక్స్ ను రద్దు చేయడం వల్ల 3.70 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చినందుకు ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి జిందాబాద్, మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా రావాలి, మీకు అండగా ఉంటామని,” ఆటో డ్రైవర్లు సీఎంకు హామీ ఇచ్చారు. ఏడాదికి రోడ్ టాక్స్ కు కట్టాల్సిన రూ.5 వేల వరకూ ఆదా చేసి సీఎం చంద్రబాబు పుణ్యం కట్టుకట్టుకున్నారని ఆటోడ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ” మీరు ఆటోలో ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళతారు. నేను రాష్ట్రపాలనను సురక్షితంగా నడుపుతూ ప్రజలను సంతోషంగా జీవించేలా వ్యవహరిస్తున్నాను. మీరు ఒక డ్రైవింగ్ సీటులో కూర్చున్నారు. నేను ఒక డ్రైవింగ్ సీటులో కూర్చుని నడుపుతున్నాను.రాష్ట్రానికి మొదటి డ్రైవర్ ని నేను.మీ అందరూ నా వెంట నడవాలి.
ఆటోలకు పన్ను మినహాయింపు
ఆటోలకు జీవిత కాలం పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నాం.
ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు ప్రయాణించే మూడు చక్రాల ఆటోలు, సరకు రవాణా చేసే మూడు చక్రాల ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్ధ్యం కలిగిన తేలికపాటి వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రయలర్లపై పన్ను మినహాయింపు ఇచ్చాం.
ఈ ఏడాది రూ.60 కోట్లు ఆటోలు నడిపేవారికి లబ్ది కలుగుతుంది. వారు ప్రతి ఏటా రూ.55కోట్ల లబ్ది పొందుతారు.
•దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.60 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంది.
•ఆటోలు,ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు వల్ల 9.79లక్షల వాహన యజమానులకు లబ్ది చేకూరుతుంది. పాసింజర్ ఆటో రిక్షాలు 5.66 లక్షలు ఉన్నాయి. వీటిపై ఏడాదికి రూ.20కోట్ల జీవిత కాల, త్రైమాసిక పన్ను మినహాయించాం.
4 సీట్ల ఆటో రిక్షాలు 5.64లక్షలు ఉన్నాయి. వీటిపై ఏడాదికి రూ.19.59కోట్ల జీవితకాల పన్ను మినహాయించాం.
5-6 సీట్ల ఆటోరిక్షాలు 10 వేలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.14 లక్షల త్రైమాసిక పన్ను మినహాయింపు ఉంటుంది.
7 సీట్ల ఆటో రిక్షాలు 10వేలు ఉన్నాయి. వీటిపై 27లక్షల త్రైమాసిక పన్ను మినహాయింపు లభిస్తుంది.
ట్రాక్టర్లు 1.82లక్షలు ఉన్నాయి. వీటిపై త్రైమాసిక పన్ను రూ.13కోట్లు మినహాయింపు చేకూర్చాం.
ట్రాక్టర్ ట్రైలర్స్ 1.45లక్షలు ఉన్నాయి. వీటిపై త్రైమాసిక పన్ను రూ.11కోట్లు మినహాయింపు ఇచ్చాం.
3చక్రాల తేలికపాటి సరుకు రవాణా వాహనాలు 86వేలు ఉన్నాయి. వీటిపై జీవితకాల పన్ను రూ.22.50కోట్ల మినహాయింపు,
మొత్తం 9.79లక్షల వాహనాల యజమానులకు రూ.66.50కోట్ల ప్రయోజనం కలిగించిన ప్రభుత్వం మాది. ఈ ప్రయోజనం మొదటిది మాత్రమే. రాష్ట్రం అంతా మీరు తిరగాలి. 3.70లక్షల మంది ఆటోడ్రైవర్లు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి. మీఆటోలకు వెనుక రాష్ట్రప్రభుత్వం పథకాలను ప్రదర్శించి ప్రజలను చైతన్యపరచాలి. నాకోసం కాదు…రాష్ట్రం కోసం పని చేయాలి. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే నా ధ్యేయం., తపన, కృషి. పెద్ద కొడుకుగా వృద్ధులకు రూ. 2 వేల పింఛను, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద పది వేల రూపాయలు అందిస్తున్నాను.పేద ఆటో డ్రైవర్లను ఏ విధంగా ఆదుకోవాలి, వారి ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాను.భవిషత్తులో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడతాం. ఇంధన ఖర్చులను తగ్గిస్తాం. ఆటోలు స్మూత్ గా ప్రయణించడమే కాక పర్యావరణహితంగా ఉంటాయి. ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆటోడ్రైవర్లు ఒక సంఘంలా ఏర్పడండి. మీ సమస్యలను చర్చించుకుని నా దృష్టికి తీసుకురండి. పరిష్కరిస్తా, తగు న్యాయం చేస్తా.అన్నక్యాంటీన్లను మీకు అందుబాటులోకి తెచ్చా. మీకోసం అన్నీ చేస్తున్నా. మళ్ళీ తెదేపా వస్తేనే రాష్ట్రానికి భవిషత్తు, అత్యుత్తమ రాష్ట్రంగా, దేశంలో అగ్రగామిగా ఎదగడానికి అవకాశం ఇవ్వండి. మీరు ఇప్పటి నుంచి సైనికుల్లా మా కోసం పని చేయండి,” అని ఆటో డ్రైవర్లకు విజ్జ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల ను సీఎం వద్దకు ఎమ్మెల్సీ బొండా ఉమ, విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కె. పట్టాభిరాం, టీఎన్టీటీయూసీ నాయకులు, తెదేపా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణలు తీసుకు వచ్చారు. భారీ సంఖ్యలో ఆటోలతోపాటు వచ్వ్హిన వారిలో మహిళా ఆటోడ్రైవర్లు ఉన్నారు.













