Assembly: 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు : బీఏసీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Assembly) సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడి (Ayyannapatruda) అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశంలో నిర్ణయించారు. సెలవు రోజులు, పనిదినాలపై కసరత్తు కొనసాగుతోంది. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ (TDP) ప్రతిపాదించింది. నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. శాసన సభ (Legislative Assembly) , మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు.