AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) చేపట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు ప్రశ్నలు (Questions) లేవనెత్తారు. అసెంబ్లీ సమావేశాలను వారం లేదా పది రోజులు నిర్వహించే అవకాశం ఉంది. ఆరు ఆర్డినెన్స్ (Ordinance) ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ఇది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ -2025 స్థానంలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.