18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలుత ఈ నెల 17 నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. అయితే ఒకరోజు ఆలస్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18వ తేదీతో పాటు 19 తేదీలలో రెండు రోజులు సభను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీని తర్వాత 20వ తేదీతో పాటు 21 శని, ఆదివారాలు రావడంతో ఆయా దినాలను సెలవుగా కేటాయించనున్నారు. అనంతరం 22వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తేదీలపై పూర్తి సృష్టతను ఈ నెల 18న జరిగే బీఏసీ సమావేశంలో రానుంది. ఇప్పటికే ఆయా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.













