ఏపీ అసెంబ్లీ సమావేశాలకు..ముహూర్తం!

ఆంధప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా, అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి.