మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
మార్చి 14 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేసించబోతోంది. ఎన్నికల ఏడాది ఎలాగో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను నిర్ణయిస్తారు. కనీసం పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటితో బడ్జెట్ పద్దు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్కు ప్రతిపాదనలు పంపగా, నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.













