ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఇకపై ఆరు పేపర్లు మాత్రమే
పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా కొవిడ్ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేదుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుడడంతో 11 పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.













