ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనకు… కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నదిపై మరో భారీ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణా నదిపై 3.5 కిలోమీటర్ల మేరకు ఈ భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు పంపారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారు. కాగా, ఈ వంతెన నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు చర్యలు తీసుకున్నా, జగన్ ప్రభుత్వం వచ్చాక పన్నుల్ని నిలిపేశారని ఎంపీ కేశినేని నాని తెలిపారు.













