YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరో కేసు
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నల్లపాడు పోలీసులు (Nallapadu Police) నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Election Code) ఉన్నా వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు నేతలు అంబటి రాంబాబు (Ambati Rambabu), లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి (Modugula Venugopal Reddy) తదితరులపై కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు వారికి 41ఏ నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పీఎస్‌కు విచారణకు రావాలని సూచించారు. రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై ఇప్పటికే జగన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.













