ఏపీలో అన్న క్యాంటీన్లు రీ-ఓపెన్.. టైమింగ్స్ ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. గుడివాడ మున్సిపల్ పార్కులో సీఎం చంద్రబాబు దంపతులు స్వయంగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి టోకెన్లు తీసుకొని క్యాంటీన్ లో భోజనం కూడా చేశారు. ఈ అన్న క్యాంటీన్లలో రూ. 5కే టిఫిన్, భోజనం దొరుకుతుంది. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి ప్రతి రోజు 1.05 లక్షల మందికి ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేల మందికి భోజనం, రాత్రి మరో 35 వేల మందికి భోజనం ఈ క్యాంటీన్ల ద్వారా అందజేయనున్నారు. ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు డిన్నర్ ఉంటుంది.













