అన్న క్యాంటీన్ల కోసం.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్..
ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం.. చతురత.. మేధస్సు కలగలిపితే చంద్రబాబు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపద సృష్టించడంతోపాటు అభివృద్ధి..సంక్షేమం రెండు అందిస్తాను అని చెప్పేవారు. ఆనాడు ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు.. కానీ ఈనాడు చంద్రబాబు దాన్ని చేసి చూపిస్తున్నారు. కొత్త రూపాయిని సృష్టించడానికి అంకురార్పణ జరిగింది.. ఇక దాని ఫలితం చేతికందడానికి కాస్త సమయం పడుతుంది. అయితే ఈలోపు టైం వేస్ట్ చేయకుండా బాబు ఉన్న రూపాయి జారిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మరోపక్క సంక్షేమం అభివృద్ధి విషయాల్లో కూడా తన రాజకీయ చతురతను స్పష్టంగా చూపిస్తున్నారు. ఇటీవల ఆంధ్రలో ప్రారంభమైన అన్న క్యాంటీన్ల విషయంలోనే బాబు మేదస్సు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది.
అన్న క్యాంటీన్లకు ఏటా 240 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే వీటి భారం నేరుగా ప్రభుత్వం మీద పడకుండా.. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగే విధంగా సంపన్నులను పిలిచి.. వారు స్వయంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేలా చేస్తున్నారు. ఇప్పటికే అన్న క్యాంటీన్ ల కోసం పెద్ద ఎత్తున విరాళాలు పోగయ్యాయి. వీటితో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్లకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగే విధంగా బాబు ప్లాన్ చేస్తున్నారు.
పేదలకు పట్టడం అన్నం పెట్టడం తో పాటు ప్రభుత్వానికి కొండంత పేరు తెస్తుంది ఈ అన్న క్యాంటీన్. ప్రస్తుతం ఉన్న వాటికి ఇంకో 100 అన్న క్యాంటీన్లు కలిసిన ఏడాదికి 200 కోట్ల వరకు వీటికి ఖర్చవుతుంది.. ఈ మొత్తాన్ని పుల్ అప్ చేయడం ద్వారా కార్పస్ ఫండ్ ను సృష్టించగలిగితే వచ్చే వడ్డీ తోటే క్యాంటీన్ నడిపేయవచ్చు. అందుకే కార్పొరేట్ శక్తులను.. పెద్దలను ప్రోత్సహించి విరాళాలు సేకరిస్తున్నారు బాబు. అనుకున్నట్లుగా మొత్తం అమౌంట్ రాకపోయినప్పటికీ ప్రభుత్వం మీద సగానికి సగమైన భారం తగ్గుతుంది. ఇలా ఒక్క సంక్షేమ పథకం అద్భుతంగా నడపడమే కాకుండా ప్రభుత్వం పై భారం ఎలా తగ్గించాలో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు చంద్రబాబు.













