TTD: రెండోసారి అవకాశం రావడం.. పూర్వజన్మ సుకృతం : అనిల్‌కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు. అనిల్ సింఘాల్‌కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury) శేషవ్రస్తాం కప్పి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రెండోసారి ఈవోగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి అకాశం రావడం పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. తిరుమల (Tirumala) పవిత్రతను కాపాడాలని చంద్రబాబు తనకు సూచించారన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు.