ఏపీ కొత్త సీఎస్ అనిల్ చంద్ర పునేఠ
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేడయంతో ఆయన నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఆయన స్థానంలో 1984 బ్యాచికి చెందిన పునేఠ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది మే వరకు పునేఠ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌తో కలిసి పునేఠ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు.













