ఏయూ ఆచార్య ప్రసన్నశ్రీ రికార్డు
ప్రపంచంలో అత్యధిక గిరిజన భాషలకు లిపులను తయారు చేసిన మొట్టమొదటి మహిళగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం ఆచార్య ప్రసన్న శ్రీ రికార్డు సృష్టించారు. అమెరికాకు చెందిన ఎన్డేంజర్డ్ ఆల్ఫాబెట్స్ సంస్థ ప్రపంచంలోని పలు లిపి లేని భాషలకు నూతనంగా తయారు చేసిన లిపులతో ఒక అట్లాస్ తయారు చేసి దాని సాఫ్ట్ ప్రతిని విడుదల చేసింది. ఈ సందర్భంగా అత్యధిక భాషలకు లిపి తయారుచేసిన మహిళగా ఆచార్య ప్రసన్నశ్రీని గుర్తించి ఆ సమాచారాన్ని ఆమెకు పంపింది. ఆ అట్లాస్‌లో ఆచార్య ప్రసన్నశ్రీ తయారు చేసిన 18 భాషల లిపులను పొందుపరిచింది. ఆయా భాషలు మాట్లాడే జాతులపై ఆమె చేసిన పరిశోధనల్లోని ముఖ్యాంశాలను కూడా ప్రస్తావించింది.













