ఇన్నోవేషన్ లీడర్షిప్ పై ఆంధ్రయూనివర్సిటీ అలూమ్ని వెబినార్ 18న
ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని(ఎఎఎ) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ లీడర్‌షిప్‌పై అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు వెబినార్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిఎంఆర్ గ్రూపు కంపెనీస్ చైర్మన్, ఎఎఎ ఫౌండర్ చైర్మన్ డా. జి.ఎం. రావు ఈ వెబినార్‌ను ప్రారంభిస్తారు. సిలికాన్ వ్యాలీలోని సిబెల్స్ ఇన్స్యూరెన్ సర్వీసెస్ (యుఎస్ఎ) సిఐఓ రావు తాడేపల్లి ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఆంధ్రయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడనున్నారు.
సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీఎస్ కృష్ణ వంటి గొప్ప వ్యక్తులు వైస్ చాన్సలర్లుగా పని చేసిన, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు కలిగిన గొప్ప యూనివర్శిటీగా ఏయూకు పేరు ఉంది. ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని (ఎఎఎ) పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.













