ఆంధ్రయూనివర్సిటీ అలూమ్ని మీట్…డిసెంబర్ 10న
మీ పేర్లను లింక్ ద్వారా రిజిష్టర్ చేసుకోండి….
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం డిసెంబర్ 10న ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనాన్ని కరోనా పరిస్థితుల కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రధాన అతిధిగా, గెస్ట్ ఆఫ్ హానర్గా ఆంధప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్, ఎపిఎస్సిహెచ్ఇ చైర్మన్ డా. కె. హేమచంద్రారెడ్డి హాజరవుతున్నారు. ఎఎఎ ఫౌండర్ చైర్మన్ డా. జి.ఎం. రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని, ఎఎఎ చైర్మన్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా పాల్గొంటున్నారు.













